Saturday, 01 August 2026 03:20:20 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సింగరేణి సెక్యూరిటీ కి రక్షణ కరువు

​సింగరేణిలో సెక్యూరిటీ గార్డుల ఆందోళన..నాలుగో రోజుకు చేరిన నిరసనలు

Date : 10 April 2026 10:46 AM Views : 332

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​సింగరేణి సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న 220 మంది కార్మికులను అకస్మాత్తుగా తొలగించడాన్ని నిరసిస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. టెండర్ గడువు ముగిసిందనే సాకుతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రోడ్డున పడేయడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 12 ఏళ్లుగా సంస్థ ఆస్తులను కాపాడుతూ శ్రమించిన కార్మికులను, వయస్సు సాకుతో మరియు కొత్త టెండర్ల పేరుతో పక్కన పెట్టడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.రెండు నెలలుగా జీతాలు లేక, కుటుంబ పోషణ భారమై సెక్యూరిటీ గార్డులు మార్కెట్ వీధుల్లో భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 220 కుటుంబాలు చీకట్లోకి వెళ్లాయని వారు ఆవేదన చెందుతున్నారు.కార్మిక శాఖ మంత్రి సొంత ప్రాంతంలోనే కార్మికులకు ఈ పరిస్థితి ఎదురవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వమే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.వెంటనే కొత్త టెండర్లు పిలిచి, పాత కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి.వయస్సు పేరుతో చేస్తున్న వడపోతను తక్షణమే నిలిపివేయాలి.పాత పద్ధతిలోనే పోస్టులను కొనసాగించి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ​ యాజమాన్యం మొండివైఖరి వీడకపోతే ఈ నిరసన జ్వాలలు సంస్థ వ్యాప్తంగా విస్తరిస్తాయి. ఆకలితో ఉన్న పేదవాడి భిక్షా పాత్రలే రేపు తిరుగుబాటు ఆయుధాలుగా మారుతాయి." అని సీఐటీయూ హెచ్చరించింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :