వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జులై 02 : మందమర్రి ఏరియా పరిధిలోని కాసిపేట్-2 ఇంక్లయిన్ గనిని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ గురువారం తొలి షిఫ్ట్‌లో సందర్శించారు.గని అంతర్భాగంలోకి వెళ్లి కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి,ఉత్పత్తి లక్ష్యాలతో పాటు బొగ్గు నాణ్యత, ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.ప్రమాద రహితంగా విధులు నిర్వహించాలని, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గని సర్వేయర్ తిరుపతి, అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం