Sunday, 02 August 2026 02:04:08 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

గోలేటీలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఆత్రం సుగుణక్క

Date : 17 June 2026 07:20 PM Views : 50

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : గోలేటీలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఆత్రం సుగుణక్క రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామానికి చెందిన కోట పద్మ–భీమయ్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీర శ్యాం నాయక్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను పొందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ ఇరుకుల మంగ,డీసీసీ ఉపాధ్యక్షులు ప్రకాష్ రావు,డీసీసీ స్పోక్స్ పర్సన్ దుర్గం రవీందర్, మండల అధ్యక్షుడు కిషన్ గౌడ్,నాయకులు సోమశేఖర్,INTUC ప్రకాష్,మహేష్ రెడ్డి,సాంబ గౌడ్,పర్వత్ సాయి,ఉప సర్పంచ్ దుర్గం తిరుపతి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు బలరాం నాయక్, లింగంపల్లి ప్రభాకర్, సురేందర్ రాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా జన సెక్రటరీ ఎర్రం తిరుపతి, వార్డు సభ్యులు బానోతు రవి,రాజు,పూదరి సాయి, క గజ్జల భీమయ్య,జాడి కిషోర్, ఆత్మకూరు శంకర్,కోట తిరుపతి పాల్, రవి, బాలు నాయక్,అన్నం రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలుగల సాయి, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :