Sunday, 02 August 2026 04:07:09 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

హుజూరాబాద్‌లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడి

భారీగా రేషన్ బియ్యం స్వాధీనం

Date : 05 July 2026 09:05 PM Views : 119

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : హుజూరాబాద్ పట్టణంలోని ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యంపై అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం సంచులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ప్రజలకు ఉచితంగా అందించాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం సంచులను అధికారులు సీజ్ చేసి, సంబంధిత దుకాణదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా లేదా నిల్వలపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

S PRADEEP

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :