వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి సి&ఎండి డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు మందమర్రి ఏరియాలోని కీలకమైన (కేకే-5) భూగర్భ గనిలో మూడు షిఫ్టుల ఉద్యోగులతో మల్టీ డిపార్ట్‌మెంటల్ సమీక్షా సమావేశాలు ఘనంగా జరిగాయి. సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా ఉద్యోగులు పునరంకితం కావాలని అధికారులు పిలుపునిచ్చారు. మందమర్రి ఏరియా ఆర్థిక వృద్ధిలో, సుదీర్ఘ చరిత్ర కలిగిన కే కే -5 భూగర్భ గని అత్యంత వ్యూహాత్మక పాత్ర పోషిస్తోందని అధికారులు కొనియాడారు. రక్షణతో కూడిన ఉత్పత్తి: భూగర్భ గనుల్లోని సవాళ్లను అధిగమిస్తూ, రక్షణ ప్రమాణాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ బొగ్గు వెలికితీయడంలో కార్మికుల కృషి అమోఘమన్నారు. కే కే -5 బొగ్గుకు ఉన్న మంచి డిమాండ్‌ను నిలబెట్టుకోవడానికి, వినియోగదారులకు మరింత నాణ్యమైన బొగ్గును అందించాలని స్పష్టం చేశారు. కంపెనీ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలు, సురక్షిత పని వాతావరణం, యాజమాన్యం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఫైనాన్స్ అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం జి.ఎల్ ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, డీజీఎం (పర్సనల్) చొల్లంగి అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్, గని మేనేజర్ శంభునాథ్ పాండే, క్వాలిటీ ఇంచార్జ్ ప్రదీప్, ఐటీ డీవై మేనేజర్ రవి, డీవై మేనేజర్ జశ్వంత్, ఈఈ శ్యామ్, సంక్షేమ అధికారిణి రవళి తదితర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం