వాస్తవ గమ్యం / తెలంగాణ / పెద్దపల్లి : గోదావరిఖని జీఎం కార్యాలయం వద్ద జరుగుతున్న సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్స్ రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ ఆర్కే సాగర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.అనంతరం నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.పార్టీ భవిష్యత్తు నిర్మాణంతో పాటు, ప్రజా సమస్యలపై జనసేన నాయకులు నిరంతరం గళమెత్తాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హరీష్, మధు, ఆవుల సాగర్, మాయ రమేష్, పవన్, అజయ్‌లతో పాటు పలువురు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం