Friday, 31 July 2026 11:09:26 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులను ఉద్యమకారుల గుర్తించాలి

Date : 12 July 2026 03:47 PM Views : 39

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ఎం. కోదండరాంకు వినతిపత్రం అందజేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి హాజరైన కోదండరాంకు సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జేఏసీ పిలుపు మేరకు సింగరేణి కార్మికులు 38 రోజుల పాటు వేతనాలు కోల్పోయి సమ్మెలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేస్తూ, విశ్రాంత ఉద్యోగులకు కూడా ఉద్యమకారుల హోదా కల్పించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు 250 గజాల ఇంటి స్థలం, రూ.50 వేల పెన్షన్, ఉద్యమకారుల గుర్తింపు కార్డులు, బస్సు-రైలు ప్రయాణంలో ఉచిత సౌకర్యం, ఉచిత విద్య, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం తదితర సంక్షేమ పథకాలను సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని నాయకులు కోరారు.అదేవిధంగా, సకల జనుల సమ్మె సమయంలో కొంతమంది కార్మికులకు మాత్రమే స్పెషల్ లీవ్ మంజూరు చేసి వేతనాలు చెల్లించారని, వేలాది మంది కార్మికులు సిక్ లీవ్ వినియోగించుకున్నందున వారికి కూడా స్పెషల్ లీవ్‌గా పరిగణించి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంతో చర్చించి న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఏ. గంగయ్య, నాయకులు ఎం. అంజయ్య, దేవులపల్లి రామస్వామి, మేడ రాజలింగు, రాజు, టీ. జనార్దన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :