Sunday, 02 August 2026 04:48:43 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం.

Date : 22 July 2026 06:38 PM Views : 43

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తేది.20.07.2026 సోమవారం చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి ఉదార నేత్ర వైద్యశాల సౌజన్యంతో, వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో మైనారిటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం లో కంటి ఆపరేషన్ అవసరం ఉన్న 54 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. వారికి బుధవారం చెన్నూర్ కు తీసుకువచ్చి వారి స్వస్థలాలకు పంపామని చెన్నూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ నిమ్మల సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కంటి ఆపరేషన్స్ అయిన వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. వారికి కంటికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేసి రేకుర్తి డాక్టర్లు చెప్పిన విధంగా చుక్కల మందులు వాడాలని, తేది.27.07.2026 సోమవారం నాడు తప్పకుండా రేకుర్తి కంటి ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా ఐ పేషంట్లకు బ్రెడ్ పంపిణి చేశారు. ఐ పేషంట్లు ఆనందంతో మాట్లాడుతూ మా లాంటి నిరుపేదలకు ఇంత గొప్ప సేవ చేస్తూన్న రేకుర్తి కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, డాక్టర్లకు మరియు చెన్నూర్ లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జోన్ ఛైర్పర్సన్ లయన్ జాడి తిరుపతి, క్లబ్ కోశాధికారి లయన్ సౌడం శ్రీనివాస్, సభ్యులు జక్కుల సత్యనారాయణ,ఎన్నాం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :