Saturday, 01 August 2026 01:25:15 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రి మున్సిపాలిటీలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన

Date : 04 July 2026 05:26 PM Views : 57

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెప్మా గ్రూప్ రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి లోక్ అదాలత్ – ఉచిత న్యాయ సేవలు అంశంపై శనివారం లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మొబైల్ వ్యాన్ ద్వారా దృశ్య ప్రదర్శన ఏర్పాటు చేసి, న్యాయ వ్యవస్థ, ఉచిత న్యాయ సేవలు, ప్రజలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, మంచిర్యాల సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎ. నిర్మలకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎ. నిర్మల మాట్లాడుతూ మహిళలపై జరిగే అన్యాయాలు, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, భూ వివాదాలు, గృహహింస, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన సందర్భాల్లో ఉచిత న్యాయ సహాయం పొందే విధానంపై వివరించారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకుని, అవసరమైనప్పుడు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు, బార్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షుడు కొత్త సత్తయ్య, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.డి. సందాని, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆర్.ఆర్. రాములు, ఎస్. సదయ్య, న్యాయవాదులు, రెవెన్యూ అధికారి పి. కృష్ణ ప్రసాద్, మేనేజర్ టి. రాజేశ్వరి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఇన్‌చార్జి, టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్ ఎ. రఘురాం, మెప్మా గ్రూప్ రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :