Sunday, 02 August 2026 04:06:41 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

రైతులకు శుభవార్త..భూ హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.

సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించిన తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్*

Date : 16 July 2026 02:57 PM Views : 104

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం దుగ్గాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిర్యాని తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్ పాల్గొని గ్రామస్తులకు సమగ్ర భూ సర్వే ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, ప్రతి రైతు భూమికి ఖచ్చితమైన హద్దులను నిర్ణయించడం, భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించడమే ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సర్వే సమయంలో భూ యజమానులు తమ భూముల వద్ద హాజరై అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. సర్వేయర్ అజయ్ సమగ్ర భూ సర్వే నిర్వహించే విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, హద్దుల గుర్తింపు ప్రక్రియ, రైతులు పాటించాల్సిన సూచనలను గ్రామస్తులకు వివరించారు. గ్రామస్తుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :