Sunday, 02 August 2026 01:51:49 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

కొత్త ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందుకు గిరిజన ఉపాధ్యాయ సంఘం సన్మానం

Date : 29 April 2026 07:10 PM Views : 152

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఐటీడీఏ-ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారిగా మంద మకరందు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (టీఎస్‌టీడబ్ల్యూటీయూ) కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా శాఖ తరఫున బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించింది. పూలగుచ్ఛం, శాలువా, మెమెంటో అందజేసి నూతన అధికారికి స్వాగతం పలికారు.ఉపాధ్యాయుల సమస్యలు ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చెందిన పాత సమస్యలు, సిఆర్‌టీల అంశాలు, ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యల ఉపసంహరణ, పిఎంఆర్‌సి కార్యాలయాల బలోపేతం వంటి డిమాండ్లను సంఘం నేతలు నేరుగా ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.అన్ని సమస్యలు ఓపికగా విన్న మకరందు, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. గిరిజన ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం టీఎస్‌టీడబ్ల్యూటీయూ నిరంతరం కృషి చేయాలని కూడా సూచించారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, ప్రధాన కార్యదర్శులు నైతం కృష్ణరావ్, మడావి గోపాల్, కోశాధికారి కూడ్మే అనంత్ సహా పలువురు సంఘ నేతలు పాల్గొన్నారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :