వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, వాస్తవ గమ్యం జూలై 7: ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమై 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని మందమర్రి మార్కెట్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం చారిత్రాత్మకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జి జీడి సారంగా మాదిగ, మండల అధ్యక్షుడు ఆసంపెల్లి శివకుమార్ మాదిగ, పట్టణ అధ్యక్షుడు చిలుముల రాజ్‌కుమార్ మాదిగతో పాటు పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం