Saturday, 01 August 2026 01:24:41 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న గంగ పుత్రులు

Date : 10 July 2026 03:59 PM Views : 103

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు మంచిర్యాల, జూలై 10: జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నేన్నెల నరసయ్య, పట్టణ అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ గంగపుత్రుల సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో ఆశించిన పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా గంగపుత్రుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు బదిలీ చేయాలని, గత 12 సంవత్సరాలుగా మరణించిన 986 మంది మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన మత్స్యకారులందరికీ 90 శాతం సబ్సిడీపై ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు అందించాలని, మత్స్యకార సహకార సంఘాల సభ్యులందరికీ రూ.20 లక్షల బీమా, ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన అధ్యక్షుడు మంచెర్ల సదానందం, శాఖపురం భీమ్సేన్, గగ్గూరి రాజన్న, మనోహర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :