Sunday, 02 August 2026 04:15:47 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

భారత్ రమణమూర్తి పై దాడి ఘటనను ఖండిస్తూ మంచిర్యాలలో నిరసన

హిందుస్థాన్ గో రక్ష సమితి

Date : 18 July 2026 07:14 PM Views : 59

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జై భారత్ వ్యవస్థాపకులు, హిందుస్థానీ గోరక్షా సమితి కన్వీనర్ రమణమూర్తిపై హైదరాబాద్‌లో టీవీ చర్చ సందర్భంగా జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ శనివారం మంచిర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ ప్రజాసంఘాల నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా నిరసనకారులు రమణమూర్తికి మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, దాడికి పాల్పడిన నిందితుడు కశ్యపరెడ్డిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వక్తలు మాట్లాడుతూ, అయోధ్య అంశంపై టీవీ చర్చలో రమణమూర్తి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దురుద్దేశంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ, తిరుపతిలో అన్నమయ్య విగ్రహ ఏర్పాటులో ఆయన పాత్రను ప్రస్తావించారు.తెలంగాణలో సర్వమత సామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలకు తావు ఇవ్వకూడదని, దాడి జరిగినప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి డూర్కె మోహన్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల మల్లయ్య, బీసీ సంఘాల జాతీయ వేదిక నాయకుడు గుమ్ముల శ్రీనివాస్, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ మోతె రామదాసు, జై భారత్ కమిటీ జిల్లా నాయకులు మనస్పూరి రమేష్, మేతరి లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారులు కైలాసం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :