వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల కలెక్టరేట్ పరిపాలన అధికారిగా దేశ్ పాండే శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. పరిపాలన అధికారిగా పనిచేసిన పిన్న రాజేశ్వర్ పదవీ విరమణ పొందడంతో దేశ్ పాండే శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.
Reporter
వాస్తవ గమ్యం