Saturday, 01 August 2026 01:24:46 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన

ప్రజల దాహాన్ని పట్టించుకోని తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలి: తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

Date : 11 June 2026 03:58 PM Views : 113

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మంచిర్యాల జిల్లా,కోటపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, రైతులకు కనీస త్రాగునీటి సౌకర్యం కల్పించడంలో వైఫల్యం చెందిన తహసీల్దార్ రాఘవేందర్ రావును తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ, నిత్యం వందలాది మంది ప్రజలు, రైతులు వివిధ పనుల నిమిత్తం వచ్చే తహసీల్దార్ కార్యాలయంలో త్రాగునీరు లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ త్రాగునీటి సదుపాయం కల్పించాలని అనేక దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, తహసీల్దార్ రాఘవేందర్ రావు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కార్యాలయానికి వచ్చే ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్‌కు గురై అనారోగ్యం పాలైతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆయన ప్రశ్నించారు.కార్యాలయం వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించని తహసీల్దార్‌పై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మర్మల శంకర్, నాగమల్లు, మడే వెంకటేష్, భీమేష్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :