Sunday, 02 August 2026 01:50:39 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

గ్రామాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికతో కృషి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 09 July 2026 07:00 PM Views : 125

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు స్థానిక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు.గురువారం జిల్లాలోని క్యాతనపల్లి పరిధిలోని అమ్మ గార్డెన్స్‌లో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యుల భాగస్వామ్యం కీలకమని అన్నారు.గ్రామాల్లో ఉన్న సమస్యలను అందుబాటులో ఉన్న వనరులతో, నిబంధనల ప్రకారం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు లభించే 15వ, 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, విబీజీ రామ్‌జీ పథకం తదితర వనరులను సమర్థవంతంగా వినియోగించి గ్రామాభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు.గ్రామాల్లో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జంతు పునరుత్పత్తి నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పశువైద్య శాఖ ద్వారా శస్త్రచికిత్సలు, యాంటీ రేబిస్ టీకాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని, గ్రామ పంచాయతీలు కుక్కలను పట్టుకోవడం, సంరక్షణ వంటి అంశాలపై దృష్టి సారించాలని అన్నారు.మురుగునీటి వ్యవస్థలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ హాళ్లు, త్రాగునీటి సరఫరా, సౌర విద్యుత్ వీధి దీపాల ఏర్పాటు వంటి పనులకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యేక నిధులు అందుబాటులో ఉన్నాయని, మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేయాలని తెలిపారు.ఉపాధి హామీ, విబీజీ రామ్‌జీ పథకాల కింద చేపట్టిన పనులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలని సూచించారు.గ్రామ పంచాయతీ నిధులను ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించాలని, నిధుల దుర్వినియోగం లేదా మళ్లింపు జరిగినట్లయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి గ్రామంలో పంచాయతీ భవనం, మహిళా సంఘాల భవనాలు తదితర మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన భూమి, పరిపాలనా అనుమతులు జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తామని తెలిపారు. అలాగే 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు కూరగాయల సాగు కోసం పందిళ్లు, బీటీ రహదారులు, మ్యాజిక్ డ్రైన్లు, సౌర విద్యుత్ వీధి దీపాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచులు చొరవ తీసుకుని కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :