Saturday, 01 August 2026 01:24:26 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఈ నెల 18న ప్రత్యేక లోక్ అదాలత్

Date : 06 July 2026 06:02 PM Views : 103

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 18న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయాధికారులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా ఎన్‌ఐ యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులతో పాటు ఇతర రాజీకి అనుకూలమైన కేసులను కూడా వేగంగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సంబంధిత పక్షాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఐ యాక్ట్ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించే లక్ష్యంతో న్యాయవాదులు తమ ఖాతాదారులకు అవగాహన కల్పించి, ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని ఆయన కోరారు. రాజీ ద్వారా పరిష్కారానికి అవకాశం ఉన్న కేసుల పక్షాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :