Friday, 31 July 2026 09:02:33 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం

100 మంది క్రీడాకారుల పాల్గొనడం – రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రతిభావంతుల ఎంపిక

Date : 27 July 2026 01:54 PM Views : 111

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్, ఆసిఫాబాద్‌లో నిర్వహించిన 5వ జాతీయ జావెలిన్ డే వేడుకలు మరియు జిల్లా స్థాయి యూత్ & కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘనంగా ముగిశాయి.జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కోట్నాక్ విజయ్ కుమార్ విజేతలకు మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ACMO ఉద్దవ్, ATDO చిరంజీవి, స్పోర్ట్స్ ఆఫీసర్ షేక్, యంగ్ ఇండియా నోడల్ ఆఫీసర్ బండ మీనారెడ్డి, కోశాధికారి మంగావతి, వైస్ ప్రెసిడెంట్లు ఆత్రం కృష్ణమూర్తి, కురుసంగ శీను, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, వ్యాయామ ఉపాధ్యాయులు రాకేష్, స్వప్న, లక్ష్మి, సునీత తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గుండం లక్ష్మణ్ మాట్లాడుతూ, ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :