వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: సింగరేణి సంస్థలో మజ్దూర్ కేటగిరీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల హోదాలను మార్చుతూ యాజమాన్యం కీలక సర్క్యులర్ జారీ చేసింది.ఉద్యోగుల విధులకు అనుగుణంగా హోదాల పేర్లను ఆధునికీకరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.కొత్త ఉత్తర్వుల ప్రకారం బంకర్ చైన్ అసిస్టెంట్, క్లే పిల్ అసిస్టెంట్, ల్యాంప్ అసిస్టెంట్, శాంప్లింగ్ అసిస్టెంట్, స్టోర్స్ ఇష్యూ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్, టబ్ మేకింగ్ అసిస్టెంట్, టబ్ రిపేర్ అసిస్టెంట్, టబ్ రిపేరింగ్ అసిస్టెంట్, వ్యాగన్ లోడ్ అండ్ షంటింగ్ అసిస్టెంట్ తదితర హోదాలుగా మార్పులు చేశారు. ఈ నిర్ణయంతో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న మజ్దూర్ ఉద్యోగుల హోదాలు అధికారికంగా అసిస్టెంట్ కేటగిరీలో నమోదుకానున్నాయి. యాజమాన్యం జారీ చేసిన ఈ సర్క్యులర్ సింగరేణి ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
Reporter
వాస్తవ గమ్యం