Friday, 31 July 2026 11:18:18 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఎరబండ–కేరెగూడ రహదారికి మరమ్మతులు.. గ్రామస్తులకు ఊరట

సర్పంచ్ కాతేలే మంజుల చొరవతో గుంతలు పూడ్చివేత – రాకపోకలు సులభతరం

Date : 09 July 2026 01:36 PM Views : 89

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాణి మండలంలోని కౌటాగాం గ్రామపంచాయతీ పరిధిలోని ఎరబండ నుంచి కేరెగూడకు వెళ్లే రహదారి గుంతలు, బురదతో దెబ్బతినడంతో ఎరబండ, తాటిగూడ, కేరెగూడ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రేషన్ బియ్యం తీసుకురావడం, అత్యవసర పనుల కోసం ప్రయాణించడం కష్టంగా మారింది.ఈ సమస్యను గ్రామస్థులు కౌటాగాం గ్రామ సర్పంచ్ కాతేలే మంజుల దృష్టికి తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించి రహదారి మరమ్మతు పనులు చేపట్టించారు. గుంతలను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనువుగా మార్చడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :