Saturday, 01 August 2026 11:45:44 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు .

Date : 31 July 2026 06:21 PM Views : 63

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలోని అర్హులైన రేషన్ కార్డుదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన మూడు నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు తెలిపారు.జిల్లాలో సన్నబియ్యం నిల్వలు తగినంతగా ఉన్నాయని, సర్వర్ సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి పంపిణీ సజావుగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు పంపిణీ కొనసాగుతుందని, కార్డుదారులు తొందరపడకుండా తమకు అనుకూల సమయంలో సంబంధిత రేషన్ దుకాణంలో బియ్యం తీసుకోవాలని సూచించారు.జిల్లాలో ప్రస్తుతం 2,57,251 రేషన్ కార్డులు ఉండగా, అర్హులైన ప్రతి కార్డుదారునికి మూడు నెలల సన్నబియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినా లేదా పక్కదారి మళ్లించినా డీలర్ల లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కార్డుదారులపై కూడా రేషన్ కార్డు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :