వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రాలు చెడిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఆసుపత్రిలోని ఎక్స్‌రే యంత్రం పనిచేయకపోవడంతో కొంతకాలంగా మాతా-శిశు ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు అందిస్తున్నారు.అయితే తాజాగా మాతా-శిశు ఆసుపత్రిలోని ఎక్స్‌రే యంత్రం కూడా సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, రోగులను టీ-హబ్ కేంద్రానికి తరలించి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా అత్యవసర వైద్య సేవల కోసం వచ్చే రోగులు, వృద్ధులు మరియు గాయపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎక్స్‌రే పరీక్షల కోసం ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లాల్సి రావడంతో సమయం వృథా కావడంతో పాటు చికిత్సలో జాప్యం జరుగుతోందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దెబ్బతిన్న ఎక్స్‌రే యంత్రాలను వెంటనే మరమ్మతులు చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఎక్స్‌రే సేవలను పునరుద్ధరించాలని ప్రజలు, రోగులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం