Saturday, 01 August 2026 01:01:11 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఎయిర్‌టెల్ టవర్ ఏర్పాటుపై నిరసన: కలెక్టర్‌కు ఫిర్యాదు

Date : 13 April 2026 07:59 PM Views : 190

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఎయిర్‌టెల్ కమ్యూనికేషన్ టవర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను స్థానిక వాకర్స్ మరియు యోగా సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు సోమవారం నాడు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.మైదానంలో ప్రతిరోజూ వందలాది మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాకింగ్ మరియు యోగా చేస్తుంటారు. పాఠశాల ఆవరణలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల వెలువడే రేడియేషన్ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​ హైస్కూల్‌లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే ఇక్కడే ఉన్న మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులు కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉంటారు. చిన్న పిల్లల ఆరోగ్యంపై టవర్ ప్రభావం పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.వందల సంఖ్యలో క్రీడాకారులు, స్థానికులు వినియోగించుకునే ఈ మైదానంలో టవర్ నిర్మించడం వల్ల ఆటలకు, వ్యాయామాలకు ఆటంకం కలుగుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు.వందలాది మంది ఆరోగ్యం మరియు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో కాకుండా టవర్‌ను వేరే చోటికి తరలించాలని వాకర్స్ & యోగా గ్రూప్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడకుండా తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :