Sunday, 02 August 2026 04:10:29 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఈనెల 28న జిల్లావ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

జిల్లా కలెక్టర్ హరిత..

Date : 27 June 2026 04:30 PM Views : 138

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలోని పిల్లల భవిష్యత్తును పోలియో మహమ్మారి బారి నుండి రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జూన్ 28 (ఆదివారం) నాడు జిల్లావ్యాప్తంగా 'పల్స్ పోలియో' చుక్కల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన గోడ ప్రతులను పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నేనే స్వయంగా జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా. కె. సీతారాం వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభిస్తున్నామని అన్నారు. జిల్లా ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయునది 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. మన జిల్లాలో ఈ వయస్సు కలిగిన 46,516 మంది పిల్లలను గుర్తించి, అందరికీ అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.​దీనికోసం జిల్లావ్యాప్తంగా 3,101 వ్యాక్సిన్ వైల్స్, 667 పోలియో బూత్‌లు, 14 ట్రాన్సిట్ పాయింట్లు, 22 మొబైల్ బృందాలు, మరియు 86 రూట్ సూపర్‌వైజర్లను అందుబాటులో ఉంచాము. అన్ని PHCలు, PP యూనిట్లు, గ్రామాలు మరియు బూత్‌లలో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.ఈ బృహత్తర కార్యం కోసం మొత్తం 2,668 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. పోలియో చుక్కల కార్యక్రమం ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇటుక బట్టీల్లో పనిచేసే కుటుంబాలు, వలస కార్మికులు, సంచార జాతులు, నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, పట్టణ శివారు ప్రాంతాలు, కొత్త కాలనీలు మరియు వ్యవసాయ క్షేత్రాల్లో నివసించే హైరిస్క్ వర్గాల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా చుక్కల మందు వేయాలని ఇప్పటికే ఆరోగ్య సిబ్బందిని ఆదేశించడమైనది.ఈరోజు సాధారణ ఇమ్యునైజేషన్‌లో భాగంగా పోలియో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, రేపు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో మళ్లీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలి. ​పోలియో రహిత సమాజ స్థాపన కోసం తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ 5 సంవత్సరాల లోపు పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు సోమ మంగళవారాలలో సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు పంపిణీ చేస్తారని అన్నారు..

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: