వాస్తవ గమ్యం / తెలంగాణ / వరంగల్ : భారతదేశ చరిత్ర అంటేనే ఆదివాసీల చరిత్ర అని, సంఘటిత పోరాటాల ద్వారానే రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని ప్రముఖ మేధావి, ఆచార్య హరగోపాల్ పిలుపునిచ్చారు. వడ్డేపల్లిలో జరిగిన ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఐక్య సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాజ్యాంగంలో 5, 6 షెడ్యూళ్లు ఉన్నా ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధిని గాలికి వదిలేశాయి.పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులను మోసం చేశారు.నిధులు లేక ఐటీడీఏలు కుంటుపడ్డాయి. పిస, రోఫర్, ల్ టీ ర్ చట్టాలను విస్మరిస్తున్నారు.కార్పొరేట్ కంపెనీల కోసం అడవులను కట్టబెడుతూ ఆదివాసీల మనుగడకే ముప్పు తెస్తున్నారు. జనాభా గణనలో ఆదివాసీలకు ప్రత్యేక రిలీజియన్ కోడ్ ఇవ్వాలి.జీవో ఎంఎస్ నెంబర్ 03 ను పునరుద్ధరించాలి. పోడు భూములకు తక్షణమే హక్కు పత్రాలు (పట్టాలు) ఇవ్వాలి.కోయ, గోండు భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలి.ఐటీడీఏల బలోపేతానికి రూ. 1000 కోట్ల నిధులు కేటాయించి, ప్రత్యేక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి అని అన్నారు ఈ సందర్బంగా.ఈ సభలో నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ఎన్నుకున్నారు.జాతీయ అధ్యక్షులు: వట్టం ఉపేందర్.జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య. రాష్ట్ర అధ్యక్షులు, గోడెం గణేష్.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: కబ్బాక శ్రావణ్ కుమార్ ఎన్నుకున్నారు.
Admin
వాస్తవ గమ్యం