వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల:కేవలం 600 గ్రాముల బరువుతో, అత్యంత క్లిష్ట పరిస్థితిలో జన్మించిన ఒక నవజాత శిశువును మంచిర్యాలలోని మల్లికార్జున చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ప్రాణాలతో కాపాడారు.దహేగాం మండలానికి చెందిన ఒక పేద దంపతులకు నెలలు నిండకుండానే కవల పిల్లలు జన్మించారు. అందులో ఒక పాప కేవలం 600 గ్రాముల బరువుతో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో, లండన్ అనుభవజ్ఞుడైన పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీనివాస్ గోపతి ఆధ్వర్యంలో వెంటనే ఎన్‌ఐసీయూ లో చేర్చారు. వైద్య బృందం 40 రోజుల పాటు నిరంతరం శ్రమించి చికిత్స అందించడంతో పాప ప్రస్తుతం 1.100 కిలోల బరువుకు చేరుకుని, పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యింది.కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు రూ. 15 నుండి 20 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి మల్లికార్జున హాస్పిటల్ యాజమాన్యం రూపాయి తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా అందించింది. తక్కువ బరువుతో పుట్టే పిల్లల కోసం హైదరాబాద్, కరీంనగర్ వెళ్లకుండా ఇకపై మంచిర్యాలలోనే ఇలాంటి అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం