Friday, 31 July 2026 09:11:13 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం

Date : 27 July 2026 12:13 PM Views : 149

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఎదులపాడ్ గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ శ్రీమతి మడావి పార్వతి అంబారావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మడావి పార్వతి అంబారావు మాట్లాడుతూ, "ప్రతి ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత. నేడు నాటిన మొక్కలే రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి" అని పిలుపునిచ్చారు.ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కొట్టె అశోక్, మల్టీ పర్పస్ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: