వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని ఎస్‌టిపిపిలో పర్చేస్, కాంట్రాక్ట్స్ అండ్ స్టోర్స్ విభాగం ఏజీఎంగా కె. సూర్యనారాయణ రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సింగరేణి సంస్థలో ఇటీవల జరిగిన ఈఅండ్‌ఎం అధికారుల బదిలీల్లో భాగంగా కొత్తగూడెం ఏరియా ఇంజినీర్‌గా విధులు నిర్వహించి స్థానిక ప్లాంట్ కు బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా ఎస్టీపీపీ జీఎం ఎం. నరసింహరావు, జీఎం (పీసీఎస్, ఓఅండ్‌ఎం) ఎం. మదన్‌మోహన్ ఆయనకు పూల మొక్కను అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పర్చేస్, స్టోర్స్ విభాగాల ఉద్యోగులు నూతన ఏజీఎంను కలిసి పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎమ్‌ఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి. పంతుల, డీజీఎంలు బి. శ్రీధర్, కె. సంతోష్ కుమార్, పి. వీరబ్రహ్మం, రాజేష్, ఎస్వో టు ఈడీ వెంకటయ్య, ఎస్ఈలు శ్యామ్ సుందర్, బి. రాము, పులి సురేష్, కె. ప్రసాద్, ఎస్వో టు జీఎం బి. శంకర్, డీవై ఎస్ఈ శ్యామల, ఈఈ అరుణ్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనంత రత్నాకర్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం