Saturday, 01 August 2026 01:01:52 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Date : 25 June 2026 08:47 PM Views : 166

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జూన్ 25: మంచిర్యాల–పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం కలకలం రేపింది. ట్రాక్ పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయి ఉండవచ్చని లేదా ఇతర కారణాలతో మృతి చెందిన ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తులో తేలనున్నాయని తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించి భద్రపరిచారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో ఆయన వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతనికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే 96186 89879, 87126 58596 నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ముందుకు వస్తే తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, రైల్వే మార్గాల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: