Saturday, 01 August 2026 01:20:29 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఆషాఢ తొలి బోనంతో తిర్యాణిలో ఆధ్యాత్మిక సందడి సమ్మక్క-సారక్క అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో బోనం..

శివశక్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ

Date : 16 July 2026 04:56 PM Views : 34

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో గురువారం ఆషాఢ మాస తొలి బోనాన్ని సమ్మక్క-సారక్క అమ్మవార్లకు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఆలయ ప్రధాన పూజారులు బొమ్మవోని సత్తయ్య గౌడ్, కరిగంటి బాపు ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు బోనాలను ఎత్తుకుని ప్రధాన వీధుల్లో సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి, కాగజ్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చిన శివశక్తులు చేసిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.డప్పుల చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన బోనాల ఊరేగింపులో మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తిర్యాణి గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.గత 25 సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ఆషాఢ తొలి బోనం సమర్పిస్తున్నామని ఆలయ ప్రధాన పూజారులు బొమ్మవోని సత్తయ్య గౌడ్, కరిగంటి బాపు తెలిపారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :