వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా హెచ్ ఎం స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు (జూన్ 15, సోమవారం) మందమర్రి ఏరియా కాసిపేట-1 మైన్ వద్ద "బాయ్ బాట" కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హెచ్ ఎం స్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ఉదయం 6:30 గంటలకు విచ్చేస్తున్నారు.బెల్లంపల్లి ఏరియా హెచ్ ఎం స్ కార్యాలయంలో వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ ఏర్పాట్లను సమీక్షించారు.ప్రధాన డిమాండ్లు.కొత్త బొగ్గు గనుల ఏర్పాటు, తెలంగాణ యువతకు ఉద్యోగాలు.మెడికల్ బోర్డు పునరుద్ధరణ, మారుపేర్ల సమస్యల పరిష్కారం.సొంత ఇంటి పథకం అమలు, కార్మికులకు ఐటీ మినహాయింపు.కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనం, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పర్మినెంట్ చేయడం.ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా కార్మికులు, నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పతెం రాజబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ సెక్రెటరీ ఎం. శివారెడ్డి, ఎండీ ఓజియర్, ఎస్.కే. ఇనూస్, కిష్టస్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం