వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామగుండం పరిధిలో గోదావరి నది పూర్తిగా అడుగంటి, ఎండిపోయిన పరిస్థితిని బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందం పరిశీలించింది.మాజీ మంత్రులు హరీష్ రావు,కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్,దివాకర్ రావు క్షేత్రస్థాయికి వెళ్లి నది పరిస్థితిని చూశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గోదావరి నది ఎడారిలా మారిందని, ప్రజలకు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని విడుదల చేసి ఇక్కడి ప్రజలను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Admin
వాస్తవ గమ్యం