Saturday, 01 August 2026 03:23:55 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

గుర్తుతెలియని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య

Date : 17 July 2026 07:53 PM Views : 373

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం పర్స నంబల కు చెందిన మసాడే సోమయ్య (65) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య కరుణా బాయ్ రెబ్బన పోలీస్ ఫిర్యాదు చేశారు.మృతుడికి భార్య లక్ష్మి సుజాత అనే ఇద్దరు కూతుర్ల తో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు అయిన లక్ష్మి గత కొంతకాలంగా హైదరాబాదులో కూలీ పనులు చేసుకుంటూ అక్కడ జీవిస్తోంది. గురువారం నంబాలలో ఉంటున్న చిన్న కూతురు సుజాత ఇంటికి లక్ష్మి రావడంతో తనని చూసేందుకు పర్స నంబాల నుండి సోమయ్య తో పాటు ఆయన భార్య నంబాల కి వెళ్ళారు.ఆ రోజంతా అందరూ కలిసి చిన్న కూతురు ఇంట్లో ఉండే శుక్రవారం ఉదయం పెద్ద కూతురు లక్ష్మి తిరిగి హైదరాబాద్ వెళుతుండడంతో ఆమెను రైలు ఎక్కించేందుకు సోమయ్య, అతని భార్య, చిన్న కూతురైన సుజాతలు ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అయితే సోమయ్య అతని భార్య, ఇద్దరు కూతుళ్లు స్టేషన్ లో ఉండగా చాయ్ తాగి వస్తానని వారికి చెప్పి రెబ్బెన బస్టాండ్ వైపు వెళ్ళాడు. చాయ్ తాగి తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో మెడపై బలంగా మోదడం తో తల మొండెం వేరు అయి సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడమైనది.. సంఘటన స్థలాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ రెబ్బెన CI సంజయ్ రెబ్బెన SI వెంకట కృష్ణ పరిశీలించి హత్య జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకున్నారు. నిందితుడి ఆచూకీ కనుక్కునేందుకు రైల్వే స్టేషన్ , ఇతర ప్రాంతాల్లో ఉన్న సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్స్ స్కాడ్ సిబ్బంది సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :