వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి జూన్ 24 అదాని కంపెనీ ఆధ్వర్యంలో టోల్ గేట్ సమీపంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరంలోమందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ రాజలింగు మొక్కలు నాటి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన, "రక్తదానం మహాదానం" అని పేర్కొంటూ, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ సునీల్ వానిస్, ఎన్‌హెచ్‌ఏఐ డిప్యూటీ మేనేజర్ సౌరబ్ రంజన్, రెసిడెంట్ ఇంజనీర్ మహేష్, హార్టికల్చర్ నిపుణులు తిరుపతి, అదాని సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం