Saturday, 01 August 2026 01:21:53 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ప్రభుత్వ ఉద్యోగుల గళం: జూన్ 2 లోగా పీఆర్సీ ప్రకటించాలి

Date : 10 April 2026 05:57 PM Views : 137

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల వాంఛలైన (పీఆర్సీ) ప్రకటన, పెండింగ్ డిఏ ల విడుదల మరియు ఇతర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈ జేఏసీ సమరశంఖం పూరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ​​2026 జూన్ 2వ తేదీ నాటికి కొత్త పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలి.పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలి.సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ముఖ్యంగా సెప్టెంబర్ 1, 2004కు ముందు నియామకమైన వారికి వెంటనే పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి.ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం తక్షణమే హెల్త్ కార్డ్స్ జారీ చేసి, నగదు రహిత వైద్యం అందించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కానున్నందున, వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి.​​ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జేఏసీ రెండు దశల పోరాటాన్ని ప్రకటించింది అందులో మొదటి దిఏప్రిల్ 17 నా మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు మెమోరాండంలు సమర్పణ. రెండోది ​మే 5 జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి అందచేయ్యడం.ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అనారోగ్యం పాలైనప్పుడు ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నాం.అన్నారు ఇ సమావేశంలో వి. లచ్చిరెడ్డి (చైర్మన్) & ఓడనాల రాజశేఖర్ (సెక్రటరీ జనరల్)రెవెన్యూ, ఉపాధ్యాయ, మున్సిపల్, మెడికల్, అగ్రికల్చర్ మరియు ఔట్ సోర్సింగ్ విభాగాలకు చెందిన సుమారు 40కి పైగా సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదని జేఏసీ స్పష్టం చేసింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :