వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో జన భవిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ప్రోత్సాహంతో కౌటాల ఎంఈఓ నానాజీ, చింతలమానేపల్లి ఎంఈఓ జయరాజ్ పర్యవేక్షణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 30 మంది విద్యార్థులకు శిక్షణ అందించారు.ట్రస్ట్ అధ్యక్షుడు డోంగ్రే సురేష్ మాట్లాడుతూ అనకోడ గ్రామానికి చెందిన జాడే చంద్రశేఖర్ బాలాజీ అమెరికాలో ఉద్యోగం చేస్తూనే స్వగ్రామ అభివృద్ధి కోసం ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, సాధికారత రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షకు కోచింగ్ అందిస్తున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో సన్మానించారు.
Admin
వాస్తవ గమ్యం