Saturday, 01 August 2026 01:25:42 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మార్కెట్ రోడ్డు పరిశీలన

Date : 07 July 2026 05:58 PM Views : 84

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఇటీవల చేపట్టిన పైప్‌లైన్ మరమ్మత్తుల కారణంగా అప్రోచ్ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిన విషయం స్థానిక మార్కెట్ వాసులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన మంద తిరుమల్ రెడ్డి సమస్యను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ రాజలింగం దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజలింగం, మున్సిపల్ ఇంజినీర్ గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు.ఈసందర్భంగా పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి అధికారులు దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చి అవసరమైన మరమ్మత్తులు చేపట్టడంతో పాటు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.దీంతో మార్కెట్ వాసులు సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :