Friday, 31 July 2026 09:04:07 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.*

జేఏసీ బంద్‌కు మండలవ్యాప్తంగా విశేష స్పందన

Date : 30 July 2026 09:45 AM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేన్నప్పటికీ తిర్యాణి మండల ప్రజలు జేఏసీ పిలుపునకు విశేష స్పందన తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో బంద్ విజయవంతంగా కొనసాగింది.జేఏసీ పిలుపు మేరకు మండలవ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి ప్రజలు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.జేఏసీ నాయకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాల వారీగా పర్యటిస్తూ బంద్ విజయవంతానికి కృషి చేశారు. శాశ్వత రహదారుల నిర్మాణం, డబుల్ లైన్ ఏర్పాటు, వంతెనల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం వంటి ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు.ప్రజల ఇబ్బందులను ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలి అని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భారీ వర్షాల మధ్య కూడా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని ఉద్యమానికి అండగా నిలవడం తిర్యాణి ప్రజల ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :