వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం మహాదానం అనే మహోన్నత భావనతో అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలోని అన్నదాత ప్రాజెక్ట్, టెక్నో డ్యాన్స్ అకాడమీ సహకారంతో సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంతా చౌరస్తా మరియు పల్లెటూరి బస్ స్టాండ్ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.ఆకలితో అలమటించే నిరుపేదలకు ప్రతి వారం నిరంతరంగా ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని 2020 ఏప్రిల్ 5న ప్రారంభించారు. దాతల సహకారం, అభ్యర్థన మేరకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం బెల్లంపల్లిలో విజయవంతంగా 389వ వారానికి చేరుకుంది.బాల గణేష్ యూత్ సభ్యులు (దబ్బు సాట్ లైన్ రోడ్ నెం.4, బెల్లంపల్లి) సహకారంతో సుమారు 200 మంది లబ్ధిదారులకు అన్నదానం నిర్వహించారు. ఇందులో భిక్షాటన చేసేవారు, నిరుపేదలు, రోజువారీ కూలీలు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ అజ్మీరా మోహన్, టెక్నో డ్యాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ, 389వ వారపు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం అందించడం ద్వారా లభించే సంతృప్తి అపారమని, ఇది సమాజానికి అందించే విలువైన సేవ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నిరంతరం సహకరిస్తున్న దాతలు, వాలంటీర్లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమండ్ల సువర్ణ, ఎం.డి. రేహానా, గన్నెవరం తిరుమలాచారి, మాతూరి వరప్రసాద్, చెందుపట్ల లింగమూర్తి, ఎం.డి. యూసుఫ్, బాల గణేష్ యూత్ సభ్యులు మరియు అమ్మ ఒడి వాలంటీర్లు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం