Sunday, 02 August 2026 04:18:41 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ప్రమాదానికి నిలువెత్తు నిదర్శనం..!

Date : 08 July 2026 04:03 PM Views : 238

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఉండాల్సిన రక్షణ కంచె పూర్తిగా తొలగిపోవడంతో పాటు, చెట్ల పొదలు, అడవి తీగలు ట్రాన్స్‌ఫార్మర్‌పైకి విస్తరించి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని వారు చెబుతున్నారు. కాలనీలో చిన్నారులు, వృద్ధులు, ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలోనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో పెరిగిన పొదలు, తీగలను తొలగించి, బలమైన రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :