Sunday, 02 August 2026 01:55:05 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​మందమర్రిలో సహారా బాధితుల భారీ ధర్నా:

"మా డబ్బులు మాకు చెల్లించాలి"

Date : 13 April 2026 03:03 PM Views : 335

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ ప్రాంతంలోని సహారా ఇండియా కార్యాలయం ముందు సోమవారం నాడు బాధితులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాలపరిమితి ముగిసి నాలుగైదేళ్లు గడుస్తున్నా,యాజమాన్యం తమ డబ్బులు చెల్లించకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లేకార్డులతో కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కష్టపడి దాచుకున్న సొమ్మును అడగడానికి వస్తే అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.లక్షలాది మంది సహారా బాధితుల సమస్యల పరిష్కారం కోసంగడ్డం వివేక్ వెంకటస్వామి(రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి)గడ్డం వంశీకృష్ణ(పెద్దపల్లి ఎంపీ) ​జిల్లాలోని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తమ డిపాజిట్లను వడ్డీతో సహా ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సహారా ఇండియా మేనేజర్‌కు అందజేశారు. ​"మా డబ్బులు మాకు చెల్లించకపోతే, జిల్లా వ్యాప్తంగా శాంతియుత మార్గంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం.అని గజెల్లి వెంకటయ్య, బాధితుల సంఘం ప్రతినిధి అన్నారు.ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్యతో పాటు సహారా బాధితులు సిహెచ్. సంజీవ్, డి. రాజమౌళి, రామ్ నరేష్ బాబు, సిహెచ్. సంపత్, ఎస్. మధు, దుర్గం మల్లేశ్వరి, భేరి రమాదేవి, దూత లక్ష్మి, పాషా, అబేదా తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :