Sunday, 02 August 2026 02:02:46 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య సంఘం డిమాండ్

Date : 24 June 2026 07:39 PM Views : 239

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు కోల్ ఇండియా హైపవర్ కమిటీ వేతనాలు, ఏరియర్స్‌తో సహా చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య సంఘం డిమాండ్ చేసింది.ఈ మేరకు బుధవారం మందమర్రి సివిక్ అడ్డా వద్ద సంఘం గౌరవాధ్యక్షుడు సంకె రవి, బెల్లంపల్లి రీజినల్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చాయని, కానీ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.కనీసం కోల్ ఇండియాలో ఒప్పందం ప్రకారం అమలు చేయాల్సిన హైపవర్ కమిటీ వేతనాలను కూడా అమలు చేయడం లేదని, పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు మిగులుగా ఉన్నారనే కారణంతో భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నాలు. జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయడం, పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైపవర్ కమిటీ బకాయిలను చెల్లించడం కోసం చేపట్టే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మందమర్రి డివిజన్ సహాయ కార్యదర్శి బచ్చలి సురేందర్‌తో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: