Saturday, 01 August 2026 01:09:05 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.ముగ్గురు అరెస్ట్

Date : 27 June 2026 08:16 PM Views : 140

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 27: రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు వాటి రవాణాకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మందమర్రి ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, మందమర్రి పోలీసులు కలిసి శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి-363లోని అందుగులపేట్ శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ లేబుళ్లు, బిల్లులు లేని 100 కిలోల లూజ్ పత్తి విత్తనాలు లభించాయి. దీంతో వాటిని నకిలీ విత్తనాలుగా గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన వారిలో పాత మంచిర్యాల మధురనగర్‌కు చెందిన మాకినేని రాఘవేంద్ర (39), మందమర్రి బురదగూడెంకు చెందిన కట్ట నరేష్ (41), పుట్టగంటి పవన్ కుమార్ (39) ఉన్నారు. వారి వద్ద నుంచి అపాచీ, టీవీఎస్ ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అమాయక రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేసే అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు.ఈ నకిలీ విత్తనాల రవాణా ముఠాను చాకచక్యంగా పట్టుకున్న మందమర్రి ఎస్ఐ నరేష్‌తో పాటు పోలీసు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాకేష్, చైతన్య, మహేందర్, సంతోష్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: