Sunday, 02 August 2026 04:48:50 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ధర్నా

Date : 13 July 2026 05:23 PM Views : 300

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఎస్‌బీఐ బ్యాంకు మాదిరిగానే యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన సింగరేణి కోల్ పెన్షన్‌దారులకు కూడా రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంకు శాఖ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ గుల్షన్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు మాట్లాడుతూ, గత రెండు నెలలుగా యూనియన్ బ్యాంకు అధికారులను పలుమార్లు కలిసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరినప్పటికీ తగిన స్పందన లభించలేదని తెలిపారు. దీంతో నిరసన కార్యక్రమం నిర్వహించి మరోసారి తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.ఎస్‌బీఐ బ్యాంకు అందిస్తున్న విధంగానే యూనియన్ బ్యాంకు కూడా సింగరేణి కోల్ పెన్షన్‌దారులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు చేయాలని వారు కోరారు. ఈ అంశంపై 15 రోజుల్లోగా బ్యాంకు యాజమాన్యం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని, లేనిపక్షంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి యూనియన్ బ్యాంకు శాఖల ఎదుట పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, పి. రాంరెడ్డి, నాయకులు పోతురాజుల చంద్రయ్య, ఇరుకుళ్ల జనార్దన్, ఎన్నం శంకర్, టి. జనార్దన్ స్వామి, శశాంక్ రావు, బి. కృష్ణ, ఎస్. ఘటయ్య, కనిగంటి లచ్చయ్య, కాటం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :